← Back to news

ఏజింగ్ వరల్డ్.. పెద్ద సవాలే!

By Krishna· 4h ago
ఏజింగ్ వరల్డ్.. పెద్ద సవాలే!

ప్రపంచ చరిత్రలో మొదటిసారి 65 ఏళ్లు దాటిన ముసలివారి సంఖ్య 5 ఏళ్లు లోపు పిల్లల సంఖ్యను దాటేసింది. అమెరికా సెన్సస్ బ్యూరో విడుదల చేసిన An Aging World: 2025 రిపోర్టు ప్రకారం, 2025 నాటికి ముసలివారి సంఖ్య 85.2 కోట్లు ఉంది. ఇది ప్రపంచ జనాభాలో 10.5 శాతం. 2060 నాటికి ఇది 200 కోట్లకు పెరుగుతుంది. జననాల రేటు తగ్గడం, ఆయుర్దాయం పెరగడం వల్ల ఈ మార్పు వేగంగా జరుగుతోంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా, భారత్ వంటి దేశాలు ఇప్పటికే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆరోగ్యం, పెన్షన్, సామాజిక వ్యవస్థలకు ఇది పెద్ద సవాలు.

More in International