నిద్ర అంటే బాడీకి రీసెట్ టైమ్!

నిద్ర పోవడం కేవలం రెస్ట్ కోసం కాదు. రోజంతా పని చేసి అలసిన బాడీ, బ్రెయిన్‌కి రీసెట్ అవసరం. నిద్రలో బాడీ విశ్రాంతి తీసుకుంటుంది, బ్రెయిన్ మెమరీని స్టోర్ చేసుకుంటుంది. రోజుకు 7-8 గంటల నిద్ర ఉంటే ఫోకస్, ఎనర్జీ పెరుగుతాయి. మంచి నిద్ర ఉంటే మార్నింగ్ ఫ్రెష్‌గా ఉంటుంది. చదువు-పనిపై ఫోకస్ పెరుగుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే నీరసం, చిరాకు, ఫోకస్ తగ్గుతాయి.. పడుకునే ముందు ఫోన్ తగ్గించి, రోజూ ఒకే టైమ్‌కి నిద్రపోవడం మంచి అలవాటు!



