టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ కమిటీ రద్దు

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రస్తుత కమిటీని రద్దు చేసింది. జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఉన్న కమిటీపై ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సుమలత, రఘు మాస్టర్‌తో పాటు 225 మంది డాన్సర్లు హాజరయ్యారు. దీంతో అక్టోబర్ 11న కొత్త కమిటీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ తెలిపింది.



