మనం వాడే ప్రాడక్ట్ Veg/Non-Veg?

ఇప్పుడు మనం యూస్ చేస్తున్న టూత్‌పేస్ట్, సోప్, షాంపూ వంటి ప్రాడక్ట్స్ శాకాహార, మాంసాహార పదార్థాలతో తయారైనవా లేదా అని ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. శాకాహార పదార్థాలతో తయారైన ప్రాడక్ట్స్ ప్యాకేజీపై గ్రీన్ కలర్ డాట్ ఉండాలి. జంతు సంబంధిత పదార్థాలతో తయారైనవి అయితే రెడ్ కలర్ లేదా బ్రౌన్ కలర్ డాట్ ఉండాలి. ఈ గుర్తును ప్యాకేజీ పైభాగంలో స్పష్టంగా కనిపించేలా ప్రింట్ చేయడం తప్పనిసరి.



