మస్క్‌పై సాండర్స్ ఫైర్.. రాజకీయ ఖర్చులపై విమర్శలు!

ఎలాన్ మస్క్‌పై అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్ విమర్శలు చేశారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం మస్క్ ₹2,759 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు తమ పట్టును కొనసాగించేందుకు మరో ₹3,482 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుతో రాజకీయాలను ప్రభావితం చేసే ధనవంతుల పెత్తనం తగ్గించాలని పిలుపునిచ్చారు. భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు పర్మిషన్స్ లేటు అవుతున్నాయంటూ మస్క్ విమర్శలు చేస్తున్న టైంలో సాండర్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.



