సౌది ఘర్షణల ఎఫెక్ట్.. ప్రయాణికులకు షాక్

సౌదీ అరేబియాలో హౌతీ–సౌదీ ఘర్షణల ప్రభావంతో తెలంగాణకు చెందిన వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. అక్టోబర్ 17 వరకు పలు విమానాలు రద్దు కావడం, వాయిదా పడటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్కు సాధారణంగా ₹30–35 వేలుండే టికెట్ రేట్ ఏకంగా ₹1.50 లక్షలకు చేరింది. అత్యవసర ప్రయాణికులు ఖతార్, యూఏఈ లేదా బహ్రెయిన్ మీదుగా రావాలని సూచిస్తున్నారు.


