చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

లడఖ్లోని 28 ప్రాంతాలకు పేర్లు ఖరారు చేసిన భారత్ నిర్ణయాన్ని చైనా వ్యతిరేకించింది. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని గుర్తించబోమని ప్రకటించింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. లడఖ్ భారత్లో అంతర్భాగమని, చైనా కాదన్నంత మాత్రాన నిజం మారదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.


