యూపీఐ ఛార్జీలు వద్దు: సిపిఎం ఫైర్!

మహబూబాబాద్ జిల్లాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలను వెంటనే ఎత్తేయాలని డిమాండ్. 2వేల రూపాయల పైన 0.4% MDR విధించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ సభ్యుడు జి. నాగయ్య చెప్పారు. ఇది అమెరికాకు లాభం చేకూర్చే నిర్ణయమన్నారు. బీజేపీ కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తోందని, ఛార్జీలు ఉపసంహరించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.


