← Back to news

కరువు జిల్లాగా ప్రకటించాలని దీక్షలు

By DK· 11h ago
కరువు జిల్లాగా ప్రకటించాలని దీక్షలు

కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుత్తిలో దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాను కరువు విపత్తు జిల్లాగా ప్రకటించి ప్రత్యేక సహాయం అందించాలని నాయకులు కోరారు. కరువు ప్రభావిత విద్యార్థులకు ఫీజు రద్దు, గ్రామాల్లో తాగునీరు, మండలాల్లో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ, చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.10 వేల కరువు పింఛన్ ఇవ్వాలని కోరారు.

More in Local