భూ అక్రమాలపై ఎంక్వైరీ వేయాలి

జడ్చర్ల పరిధిలో జరిగిన ల్యాండ్ స్కామ్‌లపై విచారణ జరపాలని MLA అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. తిరుమలాపూర్, చొక్కంపేట్‌లో 500 ఎకరాల సీలింగ్ భూముల ఫైళ్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 20 గుంటల పట్టాతో 23 ఎకరాలు కబ్జా చేశారని, సాదాబైనామా పేరుతో 500 ఎకరాలు కొట్టేశారని ఆరోపించారు. గత BRS టైమ్‌లో ధరణి రికార్డుల్లో జరిగిన మార్పులపై పూర్తి ఎంక్వైరీ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు.