రూల్స్‌కు విరుద్ధంగా లేఅవుట్లు..కంప్లైంట్

వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లుగా మార్చి ఫ్లాట్లు అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకోవాలని మండల స్థాయి ప్రజావాణి (గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశారు. భీమదేవరపల్లి మండలంలో ఉమ్మడి కొత్తపల్లి గ్రామ అబాదికి సంబంధించిన సర్వే నంబర్ 266లోని వ్యవసాయ భూమి విషయంలో ఈ ఫిర్యాదు చేసినట్లు కొత్తపల్లి 8వ వార్డు సభ్యుడు నడిగోటి నరేష్ తెలిపారు. వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల విక్రయాలు చేయడం వ్యాపారంగా మారిందని ఆయన ఆరోపించారు.



