బయటికి తీసి ఆపరేషన్..మళ్ళీ గర్భంలోకి బేబీ

అమెరికాకు చెందిన మార్గరెట్ బూమర్ గర్భంలో ఉన్న TWINSలో ఒక బేబీకు అరుదైన ‘సాక్రోకాక్సీజియల్ టెరటోమా’ అనే కణితి ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. 23 వారాల గర్భధారణలో మరో బేబీ చనిపోవడంతో, మిగిలిన బిడ్డను కాపాడేందుకు వైద్యులు గర్భాశయం నుంచి శిశువును బయటకు తీసి కణితిని తొలగించారు. తర్వాత బేబీను తిరిగి గర్భాశయంలో ఉంచారు. శస్త్రచికిత్స విజయవంతమై, 36 వారాలకు ఆరోగ్యంగా జన్మించింది. ఆ చిన్నారికి ‘లిన్లీ హోప్’ అని పేరు పెట్టారు.



