← Back to news

బ్యాంక్‌ స్టాఫ్‌పై కారం పొడి.. 4 లక్షలు!

By Mahesh· 1d ago· TOI· Nagpur

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. నిన్న భాండే ప్లాట్‌లోని ఓ బ్యాంక్‌ సిబ్బంది ATM నుంచి క్యాష్ తీసుకుని బ్రాంచ్‌లోకి వెళ్తుండగా.. ముఖానికి వైట్ క్లాత్‌ కట్టుకున్న వ్యక్తి వెనుక నుంచి వచ్చి వారిపై కారం పొడి చల్లాడు. వెంటనే రూ.4.53 లక్షల క్యాష్‌ లాక్కుని ఎస్కేప్ అయ్యాడు. ఉద్యోగులు అలారం చేయడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. వెంటనే ఛేజ్‌ చేసి 28 ఏళ్ల నిందితుడిని పట్టుకున్నారు. అతడి నుంచి మొత్తం డబ్బును రికవర్‌ చేశారు. నిందితుడిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Crime