లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

AP : ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం దగ్గర గ్రీన్‌ఫీల్డ్ హైవేపై యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే వచ్చి గాయపడిన వారిని చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు.
