పొద్దున్నే కారు యాక్సిడెంట్
ఇందల్వాయి మండలంలో ఇవాళ పొద్దున్నే 5 గంటల టైమ్‌లో కారు యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, ఎవరికీ ఏమీ కాలేదు. ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు స్పాట్‌కి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు.



