అక్కడ 3 రోజులకోసారి తాగునీరు!

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరేట్లు కనపడుతున్నాయి. కనీసం మూడు రోజులకు ఒకసారైనా తాగు నీళ్లు అందేలా చూడాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అధికారులకు సూచనలు ఇచ్చారు. మంగళవారం ఉదయం ఫిల్టర్ పాయింట్, నల్లమల వైపు పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిశీలించారు. నల్లమల ప్రాంత ప్రజలు 9 రోజుల నుంచి ట్యాంకర్లు రాకపోవడంతో ప్రైవేటుగా డబ్బులు పెట్టి నీటిని కొంటున్నామన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చేస్తున్నామని MLA చెప్పారు.


