పేపర్ లీకులకు చెక్ పెట్టే టెక్ ప్లాన్నం : నందన్ నీలేకని

ఎగ్జామ్ పేపర్లు ముందే లీక్ కాకుండా ఉండేందుకు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నీలేకని ఓ ఐడియా చెప్పారు. అక్టోబర్ 13న న్యూఢిల్లీలో జరిగిన Bloomberg New Economy Forumలో మాట్లాడుతూ.. భారీ క్వశ్చన్ బ్యాంక్ నుంచి ఎగ్జామ్ రోజే పేపర్ తయారు చేస్తే లీకుల రిస్క్ తగ్గుతుందన్నారు. AIతోనూ ప్రశ్నపత్రాలు తయారు చేయొచ్చని చెప్పారు. అలాగే ఎగ్జామ్స్ను కంప్యూటర్ల ద్వారా నిర్వహించే సెంటర్ల సంఖ్య పెంచాలని సూచించారు. ఈ మార్పులతో పేపర్ లీకులు తగ్గే అవకాశం ఉందని ఆయన చెప్పారు.



