ZPTCగా అవకాశం కల్పించాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు జిల్లా ZPTCగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు తిరువీధుల శారద కోరారు. బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వైసీపీలో పనిచేసిన అనుభవంతో పాటు, శారద ఫౌండేషన్ ద్వారా లక్ష చీరల పంపిణీ సహా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తన సేవలను గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్, లోకేశ్లను ఆమె కోరారు.




