రోడ్డుపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-భీమిలి రహదారిపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. భీమిలి క్రాస్ రోడ్డు నుంచి ఆనందపురం వైపు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. North Traffic CI CH.ఉమాకాంత్, ఆనందపురం Traffic SI P. పాపారావు ఆధ్వర్యంలో అత్యాధునిక Speed Laser Gunతో వాహనాలను తనిఖీ చేశారు. అతివేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడిన 100 మంది వాహనదారులను గుర్తించి ఫైన్ వేసినట్లు SI పాపారావు తెలిపారు.



