సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు.. పరకాలలో తనిఖీ!

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ గురువారం పరిశీలించారు. గొడ్ల అంగడి మైదానంలో విద్యుత్ దీపాల అమరిక, పారిశుధ్య పనులను ఆయన తనిఖీ చేశారు. మహిళలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. లైటింగ్ సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బండి శ్రీధర్, నాయకులు అల్లే దశరథం, పోరంట్ల వేణు, గొడుగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



