డేటా సెంటర్లపై ప్రశ్నిస్తే.. బ్లాక్!
AP: విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు అంశంపై హ్యూమన్ రైట్స్ ఫోరం -HRF సహా కొన్ని సంఘాలు అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాయి. డేటా సెంటర్లు వద్దు అంటూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న ‘Stop Vizag Data Centers’ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని సెప్టెంబర్ 19న Meta ఇండియాలో బ్లాక్ చేసింది. ఎందుకిలా చేశారో చెప్పాలని HRF డిమాండ్ చేస్తోంది. ఎవరి ఆదేశాలతో Meta ఈ పని చేసిందో బయటపెట్టాలని కోరుతోంది. మరోవైపు ప్రభుత్వం డేటాసెంటర్ల వల్ల అభివృద్ధి జరుగుతుందని అంటోంది. మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.


