← Back to news

ఇల్లు మంజూరు కాలేదని వ్యక్తి ఆవేదన

By Bala· 4h ago

జనగామ జిల్లా ఎల్లంగాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై నిరసన వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన బిర్రు రాజు ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించారు. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ సభ ద్వారా లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని కోరుతున్నారు.

More in Local