MLAను కలిసిన జనసేన పార్టీ నాయకులు

స్థానిక ఎన్నికల వేళ కూటమి సమన్వయంపై జనసేన నేతలు దృష్టి సారించారు. విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ను జనసేన పార్టీ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ సమన్వయకర్త నేతుల స్రవంతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ జనసేన నాయకుడు గండి చిరంజీవులు, నాలుగు మండలాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.



