← Back to news

రాజాం మున్సిపల్ చైర్మన్‌ కూటమి అభ్యర్ధిగా జనసేన

By Mohan· 1d ago· Vizianagaram
రాజాం మున్సిపల్ చైర్మన్‌ కూటమి అభ్యర్ధిగా జనసేన

విజయనగరం జిల్లా రాజాం మున్సిపల్ చైర్మన్ పదవిని కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కేటాయించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో చైర్మన్ పదవిపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంపై రాజాం నియోజకవర్గ జనసేన శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

More in Local