బ్లూ డ్రమ్ హత్యకేసులో నిందితులకు ఉరిశిక్ష

'బ్లూ డ్రమ్ కేసు'గా వైరల్ అయిన మీరట్లో జరిగిన సౌరభ్ రాజ్పుత్ హత్యకేసులో ఇద్దరు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. జిల్లా జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా కోర్టులో విచారణ జరిగింది. జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరైన ఇద్దరు దోషులు ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాను, శిక్ష ప్రకటించే ముందు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని జడ్జి అడగ్గా, ఏమీ లేదని చెప్పారు. తర్వాత జడ్జి తీర్పు చెప్పారు. తీర్పు విన్న తర్వాత దోషులు ఎమోషనల్ అయ్యారు.

