← Back to news

విశాఖలో కరెన్సీ నోట్ల కలకలం

By Krishna· 4h ago
విశాఖలో కరెన్సీ నోట్ల కలకలం

AP: విశాఖపట్నం.. సెంట్రల్ పార్కు దగ్గర కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. పార్క్ ముందు కుప్పగా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు పడి ఉన్నాయి. వాటిలో 500, 100, 50, 20, 10 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని ఒకే చోట కుప్పగా ఎవరు వేసి ఉంటారు అనే ప్రశ్నలొస్తున్నాయి. నోట్లతో పాటూ.. LIC రిసీట్లూ, ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు కూడా ఉన్నాయి. వాటిని గమనించిన వాకర్స్ పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More in AP