దొంగతనాల కేసులో నలుగురు అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వీర్‌లంకపల్లి జంక్షన్‌లో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 5న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి బట్టలు, కళ్లజోళ్లను దొంగిలించిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు కీలు శివ (19), కామకుల వినయ్ అలియాస్ గుండు (20)తో పాటు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సెప్టెంబర్ 18న వీర్‌లంకపల్లి జంక్షన్ సమీపంలోని టీ షాపు తాళాలు పగలగొట్టి రూ.5 వేల నగదు, సిగరెట్లు దొంగిలించినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.


