అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

పెనుకొండ మున్సిపాలిటీలోని 11వ వార్డులో మంత్రి సవిత పర్యటించారు. బైక్ ర్యాలీగా వెళ్ళి ప్రజలతో మాట్లాడి, స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈశ్వర్ రబ్బర్ ఫ్యాక్టరీ CSR నిధులతో 5 లక్షల రూపాయిలతో కట్టిన బస్ షెల్టర్, 5 లక్షల రూపాయిల RO వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు. 50 మంది అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కొత్త పెన్షన్లు, ఇళ్లు రాని వారికి త్వరలోనే అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.



