నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్సై

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో వినాయక నిమజ్జనం ఊరేగింపును ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్సై కూచిపూడి జగదీష్ సూచించారు. నిమజ్జనం సందర్భంగా DJలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్‌లను వినియోగించరాదని మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులకు స్పష్టం చేశారు. ఊరేగింపుతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.


