"సూపర్ డాక్టర్.. మోదీకి థాంక్స్": అభిజీత్ దీప్కే
CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే మళ్లీ ప్రధాని మోదీపై సెటైరికల్ వీడియో ట్వీట్ చేశారు. ఆ వీడియోలో గిరిజన ఆరోగ్య క్లినిక్‌లో పనిచేస్తున్న ‘డాక్టర్’తో మాట్లాడుతున్నానంటూ.. ఆయన ఓ గేదెతో మాట్లాడారు. ఎందుకంటే అక్కడ పాడైపోయిన క్లినిక్ దగ్గర, గేదెలు మాత్రమే ఉన్నాయి. మధ్యప్రదేశ్.. బాలాఘాట్‌లో 30 మందికి పైగా గిరిజన పిల్లలు చనిపోవడంతో.. దేశవ్యాప్తంగా గిరిజనుల జీవితాలు ఎంత దయనీయంగా ఉన్నాయో దీప్కే ప్రజలకు చూపిస్తున్నారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


