← Back to news

భారత్‌ విజయం.. ఫైనల్లో పాక్‌తో ఢీ!

By Anusha· 1 Oct 2026
భారత్‌ విజయం.. ఫైనల్లో పాక్‌తో ఢీ!

ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో శ్రీలంకను 124 రన్స్ తేడాతో చిత్తు చేసింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 రన్స్ చేసింది. ఇషాన్‌ కిషన్‌ 80 పరుగులతో అదరగొట్టాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక 45 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా, అక్షర్‌, అభిషేక్‌ చెరో 2 వికెట్లు తీశారు. మరో సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరింది. శనివారం కప్ కోసం భారత్‌-పాక్‌ తలపడనున్నాయి.

More in Sports