YCPకి బిగ్ షాక్: ఏకంగా 15 కుటుంబాలు!

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో YCPకి భారీ షాక్ తగిలింది. నందిగామ మండలం బెల్లకొండవారి పాలెంకు చెందిన దాదాపు 15 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాయి. MLA తంగిరాల సౌమ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారంతా పార్టీ మారారు. TDPలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే సౌమ్య కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.