కరెంట్ సబ్‌స్టేషన్ ముందు రైతుల నిరసన

మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. మర్రిగూడెం పంచాయతీ పరిధిలో పంటలు సాగు చేస్తున్న రైతులు లోవోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించి త్రీఫేస్ విద్యుత్ సరఫరా కల్పించాలని డిమాండ్ చేశారు. లోవోల్టేజ్ కారణంగా మోటర్లు కాలిపోకుండా చూడాలని, ట్రాన్స్‌ఫార్మర్ DPలపై ఓవర్‌లోడ్ తగ్గించి అవి కాలిపోకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను కోరారు.


