గణేష్ నిమజ్జనంపై పోలీసుల సమన్వయ భేటీ..!

గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని ఈ భేటీ. ఈనెల 13న ఉదయం 10 గంటలకు సీకే కన్వెన్షన్ హాల్‌లో మీటింగ్ జరుగుతుంది. మంగళగిరి రూరల్ CI చిరుమామిళ్ల వెంకట్ ఈ వివరాలు తెలిపారు. గణేష్ విగ్రహ కమిటీ సభ్యులు, మత పెద్దలు, ముస్లిం, క్రిస్టియన్ ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ కంట్రోల్, నిమజ్జన ఏర్పాట్లపై చర్చిస్తారు. అన్ని వర్గాల సమన్వయంతో ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని CI స్పష్టం చేశారు.