← Back to news

షుగర్ ఫ్యాక్టరీ మూసివేత.. 28న భారీ ర్యాలీ..

By Mohan· 2h ago· Rajam, Rajam, Vizianagaram
షుగర్ ఫ్యాక్టరీ మూసివేత.. 28న భారీ ర్యాలీ..

విజయనగరం జిల్లాలోని సంకిలి షుగర్ ఫ్యాక్టరీ మూసివేత ప్రతిపాదనపై రైతులు ఫైర్ అవుతున్నారు. ఉత్తరాంధ్రలో ఇదే ఏకైక షుగర్ ఫ్యాక్టరీ. మూసేస్తే వేలాది రైతులు, కార్మికుల జీవితాలు డేంజర్లో పడతాయని ఏపీ చెరుకు రైతు సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల 28న సంకిలి నాగావళి నుంచి ఫ్యాక్టరీ వరకు భారీ ర్యాలీని ధర్నాను నిర్వహించబోతోంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

More in Local