← Back to news

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిష్కారానికి చొరవ

By epuri rajaratnam· 5d ago
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిష్కారానికి చొరవ

AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చొరవ చూపారు. యూజీసీ పే స్కేళ్లు, కమిటీ సిఫార్సు చేసిన వేతన పెంపును అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్, ఏఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌తో ఫోన్‌లో చర్చించారు. వేతన పెంపు సిఫార్సులను ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో ఆమోదించి అమలు చేయాలని కోరారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన ప్రొఫెసర్ల సేవలను క్రమబద్ధీకరించాలని అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు.

More in Local