టీవీలు, ఓవెన్లలో AI.. ఇక టెన్షనేనా?

రోబో సినిమాలో చిట్టి తనలాంటి రోబోలను తయారు చేసుకోవడం గుర్తుందా? అలాంటి ముప్పు నిజ జీవితంలోనూ రావచ్చని AI సంస్థ ఆంథ్రోపిక్ హెచ్చరించింది. ఇంటర్నెట్కు కనెక్ట్ అయిన స్మార్ట్ టీవీలు, ఓవెన్లు, TV బాక్సుల్లోకి AI చొరబడి, తనంతట తానే వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిపింది. ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ పరికరాల్లో సెక్యూరిటీ బలహీనంగా ఉండటంతో ఈ వ్యాప్తిని అడ్డుకోవడం కష్టమని చెప్పింది. డేటా సెంటర్ల సాయం లేకుండానే మరికొన్ని నెలల్లో ఇలా జరగవచ్చని హెచ్చరించింది.



