గురుకుల విద్యార్థినుల ఆటో బోల్తా

నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం మహాలక్ష్మీపురం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడింది. సచివాలయంలో నిర్వహిస్తున్న Information Technology క్లాసులకు విద్యార్థినులను మూడు ఆటోల్లో ప్రిన్సిపాల్ పంపించారు. ఎదురుగా వచ్చిన సిమెంట్ ఆటో ఢీకొనడంతో ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థినులు గాయపడగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన టీచర్‌ను KIMSకు తీసుకెళ్లారు.



