భయంతో విద్యార్థినుల పరుగులు.!
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ - LPU గర్ల్స్ హాస్టల్‌లో సెప్టెంబర్ 27 ఆదివారం తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక విద్యార్థినిని ప్లంబర్ లైంగికంగా వేధించాడనే వార్తలు వ్యాపించడంతో విద్యార్థినులు భయాందోళనతో హాస్టల్ నుంచి బయటకు పరుగులు తీశారు. క్యాంపస్‌లో నిజంగా ఏం జరిగిందో ఇంకా క్లారిటీ రాలేదు. స్టూడెంట్స్, పేరెంట్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆరోపణలను వర్శిటీ ఖండించింది. S.I.T ఎంక్వైరీ చేస్తోంది.


