ఏలూరులో ఎనిమిది మంది అరెస్ట్..!

ఏలూరు జిల్లాలో శివ కామాక్షి నగర్‌లోని చాటపర్రు రోడ్డులో పేకాట స్థావరంపై ఆదివారం రూరల్ పోలీసులు దాడి చేశారు. ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 51,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.



