బిల్లులకు రూ.20 వేల లంచం?

వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్‌లో సీరియస్ ఆరోపణ. నాద్యనాయక్ తండా మాజీ సర్పంచ్ శంకర్‌కు రూ.1.20 లక్షల పాత బిల్లులు పెండింగ్. వాటిని క్లియర్ చేయాలంటే ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది రూ.20 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామ డెవలప్‌మెంట్ పనులు అప్పులు చేసి చేశామని, బకాయిల కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా రిజల్ట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి బిల్లులు రిలీజ్ చేయాలని కోరారు.


