← Back to news

వయోవృద్ధుల చట్టాలపై అవగాహన

By SK· 1d ago· Peddapalle (Ct), Peddapalli, Peddapalli
వయోవృద్ధుల చట్టాలపై అవగాహన

వయోవృద్ధుల హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా వయోవృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించే పోస్టర్లను ఎస్‌ఐ చంద్రకుమార్‌‌కు జిల్లా సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ రాజయ్య అందజేశారు. వయోవృద్ధులు ఎదుర్కొనే సమస్యలు, వారికి అవసరమైన సహాయం కోసం 14567 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో FRO స్వర్ణలత, CADRE స్కూల్ అధ్యక్షులు సతీష్ పాల్గొన్నారు.

More in Local