సుంకేసుల రిజర్వాయర్ నీటి మట్టం వివరాలు

జోగులాంబ గద్వాల్ జిల్లా సుంకేసుల రిజర్వాయర్లో ఆదివారం ఉదయం నాటికి నీటి మట్టం 954.721 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.235 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.845 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. రిజర్వాయర్లోకి ఇన్ప్లే 11,000 ఉందని, అవుట్ ఫ్లో రూపంలో 1,058 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.



