సింగరేణి కార్మికులకు అండగా ఉంటాం: గండ్ర

జయశంకర్ జిల్లా భూపాలపల్లిలోని KTK-1 Incline వద్ద కార్మికుల సమస్యలపై గేట్ మీటింగ్ నిర్వహించారు. బుధవారం ఉదయం INTUC ఫిట్ సెక్రటరీ సోతుకు సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో కార్మికుల సమస్యలను ప్రస్తావించినట్లు చెప్పారు.


