హొళగుంద ZPTC రేసులో వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి!

కర్నూలు జిల్లా హొళగుంద మండల జడ్పిటిసి స్థానం జనరల్ రిజర్వేషన్ కావడంతో వైసీపీ సీనియర్ నేత శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. హెబ్బటం గ్రామానికి చెందిన ఆయన, అవకాశం ఇస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.



