హాఫ్ మారథాన్‌లో సత్తా చాటిన బ్రాహ్మణపల్లి యువకుడు

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కూర్మ అనిల్ కుమార్ కరీంనగర్‌లో నిర్వహించిన 21K హాఫ్ మారథాన్‌లో ప్రతిభ చాటారు. ఆదివారం జరిగిన ఈ పరుగు పందెంలో 2 గంటల 5 నిమిషాల్లో రేసును పూర్తి చేసి ఫినిషర్ మెడల్ సొంతం చేసుకున్నారు. హాఫ్ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో బ్రాహ్మణపల్లి గ్రామస్థులు అనిల్ కుమార్‌ను అభినందించారు. ఆయన సాధించిన ఘనత గ్రామానికి గర్వకారణమని పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు.



