← Back to news

UCG ప్రాజెక్ట్‌పై జగన్‌కు రైతుల వినతి

By DK· 10h ago
UCG ప్రాజెక్ట్‌పై జగన్‌కు రైతుల వినతి

ఏలూరు జిల్లా చింతలపూడి–రేచర్ల ప్రాంతంలో ప్రతిపాదిత అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (UCG) ప్రాజెక్ట్‌పై రైతులు తమ అభ్యంతరాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ప్రాజెక్ట్‌ వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం ఉందని, సాగునీరు, సారవంతమైన పంట భూములపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌ వల్ల కలిగే ప్రభావాలపై పర్యావరణ, శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని కోరారు.

More in Local