కాంగ్రెస్ విజయమే లక్ష్యం : ఎమ్మెల్యే శంకర్

ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ కాండిడేట్ సామ రామ్మోహన్ రెడ్డి గెలుపే టార్గెట్గా లీడర్స్, క్యాడర్ కలసికట్టుగా వర్క్ చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్నగర్ బృందావన్ గార్డెన్స్లో జరిగిన ప్రిపరేటరీ మీటింగ్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చారు.



