ఎండపల్లిలో పారిశుధ్యంపై అధికారుల చర్యలు

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో చెత్త పేరుకుపోవడంపై అధికారులు స్పందించారు. చెత్త కుండీల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. దీంతో ప్రధాన కూడలి పరిసరాలు పరిశుభ్రంగా మారాయి. చెత్త పేరుకుపోకుండా పారిశుధ్య నిర్వహణపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.


