భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి సంస్థ (SCCL) చేపడుతున్న భూసేకరణ ప్రక్రియలో భాగంగా ఉప్పట్ల కేసరం గ్రామంలోని భూములను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. అనంతరం రాజాపూర్ గ్రామంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములుతో కలిసి భూ నిర్వాసితులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఉప్పట్ల కేసరం సర్వే నంబర్ 35లోని ప్రభుత్వ భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.




